Categories
తగినంత ఐరన్ ఆహారం ద్వారా తీసుకుంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు ఎక్సపర్ట్స్. గర్భం ధరించే వయసులో ఉన్న మహిళలు చిన్న పిల్లలు ప్రధానంగా రక్తహీనతకు లోనవుతుంటారు. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తినటమే పరిష్కారం ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ కనుక పుష్కలంగా ఆకుకూరలు తినాలి అనేక రకాల పండ్లు సీజనల్ గా దొరకేవాన్ని తినాలి. చేపలు, రొయ్యలు, రెడ్ మీట్, చికెన్, గుడ్లు మొదలైనవి మంచివి. డ్రై ఫ్రూట్స్, సెనగలు, గుమ్మడి గింజలు, మెంతులు, సబ్జా, అవిస తృణధాన్యాలు ఉలవలు, బెల్లం మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువ. ఐరన్ ను శరీరం గ్రహించాలి అంటే ఐరన్ ఉన్న పదార్థాలతో పాటు విటమిన్-సి ఉన్న ఆహారం కూడా తీసుకోవాలి.