చిన్నా ఇల్లయినా పొందికగా ,చక్కని గృహపకారణాలతో సర్దుకొంటే ఎంతో చోటు కలిసొస్తుంది . ముందుగా ఇంట్లో అక్కరలేని సామాను ఎన్ని పోగుచేసి పెట్టుకొన్నామో,కొన్ని ఎంతో కాలంగా ఉండటానికి లిస్ట్ చేసుకొని తీసేయాలి . ఈ విషయంలో కాస్త నిర్ధయగానే ఉండాలి . సెంటిమెంట్స్ తో ప్రతి వస్తువు ముఖ్యమైనదే అనుకోకూడదు . మూలగా వేసే సోఫాలు వాడితే ఇల్లంతా చిందర వందరగా కుర్చీలు లేకుండా విశాలంగా ఉంటుంది . గదిలో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా వాల్ షల్ఫ్ లు పెట్టుకొని వాటిలో చక్కగా సర్దిపెట్టుకోవాలి . షల్ఫ్బోర్డ్ లు గోడలోనే ఏర్పాటు చేసుకొంటే ఇంకా చోటు కలసి వస్తుంది . కొన్ని వస్తువులు అన్ని ఫొల్డ్ చేసేవే వస్తున్నాయి .ఫోల్డ్ అవుట్ డిస్కెలు ,లాఫ్డ్ బెడ్ వంటివి కొనుక్కొంటే చాలా చోటు కలిసి వస్తుంది . అవసరం తొరగానే వాటిని మడతలు పేటి ఒక మూలగా ఉంచేయవచ్చు .
Categories