రోజంతా అలసిపోకుండా ,హుషారు గా ,తరగని ఎనర్జీతో ఉండాలంటే ఎనర్జీ డ్రింక్స్ కంటే నెమ్మదిగా అరిగే కార్బొహైడ్రేడ్ తీసుకోమంటున్నారు . బ్రౌన్ రైస్ పూర్తిస్థాయి ధ్యాన్యాలు కంద ,చిలగడ దుంప క్వినోనా వంటివి రోజు మొత్తం శక్తిని నిరంతరాయంగా అందిస్తూనే ఉంటాయి.త్వరగా జీర్ణమైపోయే చక్కెరలు లైట్ బ్రెడ్ వంటివి బ్లడ్ షుగర్ స్థాయిని పెంచి ఇన్స్ లిన్ స్పందనను పెంచుతాయి. వర్క వుట్స్ చేస్తూ ఎంతో శక్తిని ఉపయోగించే వాళ్ళు వీటిని ఆహరంలో భాగంగా తీసుకొంటే తరిగిపోయే ఇంధన నిల్వలను శరీరం కొవ్వు నిల్వల నుంచి కాకుండా ఈ అదనపు కార్బోహైడ్రేడ్స్ నుంచి తీసుకొంటుంది.

Leave a comment