Categories
కర్పూరపు సువాసన అందరికీ తెలిసిందే. పెళ్ళిళ్ళలో కూడా కర్పూరం పుల్లలు ఇస్తారు. చక్కని పరిమళం తో ఉండే ఈ కర్పూరం శ్వాస మార్గం లో కఫం చేరుకోకుండా చేస్తుంది. వైరస్ లు వ్యాపించనపుడు తుమ్ములు,దగ్గులు జలుబు వంటివి వస్తాయి. ఆలా శుభ సంధర్భాల్లో తుమ్మకుండ కర్పూరం పుల్ల చేతి లో ఉంచుతారు. పావు చెంచా కర్పూరం ఒక గుడ్డలో కట్టి వాసన చూస్తూ ఉంటే వైరస్ ను ఊపిరి తిత్తుల్లోకి పోనివ్వకుండా శ్వస నాళాలను శుభ్రం చేస్తుంది. జలుబుతో ఉంటే ఇన్ హేలర్ లు వాడటం కన్నా ఇది సురక్షితమైన పద్ధతి ఈ కర్పూరపు పొడిలో వాము పొడి కూడా కలుపుకొంటే ఈ వాసన ఇమ్యూనిటీ ని పెంచుతుంది. ప్రస్తుత కాలం లో మందు లేని కరోనా వైరస్ వైద్యానికి,రోగ నిరోధక శక్తి పెంచుకొనేందుకు సహజమైన ఔషధాలే వాడాలి.