లాక్ డౌన్ వేళలో తంతి తపాలా శాఖలో 17 వేల మంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సారథ్యం వహించిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంధ్యారాణి కన్నెగంటి పేరు చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రధాన బాధ్యత ప్రభుత్వం అందించే రకరకాల పింఛన్లు కరోనా ఆర్ధిక సాయం లబ్ధిదారులకు పంపిణీ చేయటం,వందల కోట్ల రూపాయలు మారుమూల గ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాట్లు ఇవన్నీ సమర్ధవంతంగా నిర్వహించారు సంధ్యారాణి డైరక్టర్లు,ప్రాంతీయ జిల్లా అధికారులతో చర్చించి సూచనలు తీసుకొని సిబ్బంది భద్రత కోసం గ్లువుజులు,శానిటైజర్ల ఏర్పాటు చేసి ,సరైన ప్రణాళిక ఉండే సమర్ధవంతమైన సేవలు ఎలా అందించ వచ్చో నిరూపించారు సంధ్యారాణి. ఇది మా సమిష్టి విజయం అంటున్నారు సంధ్యారాణి.