Categories
పైలట్, మోటార్ కార్ రేసర్, ఎంటర్ప్రెన్యూర్ గా శిక్షణ షనా పరమేశ్వర్ సాహస ప్రపంచంలో ఒక కొత్త వెలుగు. యుకె లో 2017లో జరిగిన మోడ్బాల్ ర్యాలీలో పాల్గొన్న తొలి ఇండియన్ షన. ఇప్పటివరకు ఆ ర్యాలీ లో మన దేశానికి చెందిన మగవాళ్లు ఎవ్వరూ పాల్గొనలేదు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక మోటార్ స్పోర్ట్స్ షనా పోటీల్లో పాల్గొన్నది. వాహనాల రంగంలో ఆమె అందరికీ సుపరిచితురాలు ఆటోమొబైల్ పరిశ్రమ లో ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తోంది. ఆమె ఒక ప్రొఫెషనల్ రేసర్. ది మార్క్యూ వన్ మోటార్ క్లబ్’ డైరెక్టర్. వాహనం నడిపేందుకు శారీరక దారుఢ్యం ఒక్కటే చాలదు. వ్యూహాత్మక నైపుణ్యం ఉండాలి అది ఆడవాళ్ళ లోనే ఎక్కువగా ఉంటుంది అనుకొంటాను అంటోంది షనా పరమేశ్వర్.