ఫ్యాషన్ అన్నది ఎప్పుడూ కొత్త పోకడలకు పోతూనే వుంటుంది. ఫ్యాషన్ డిజైనర్స్ సారి కొత్తగా కనిపిస్తుంది అనుకున్న ప్రతి దాని ఫ్యాషన్ స్టేట్మెంట్స్ కింద మార్చేయగలరు. అలా వచ్చిన నయా సంచలనం బ్రష్ స్ట్రోక్ కలర్ ప్రింట్ డ్రెస్సెస్. పేరు కొత్తగా ఇంత పొడుగ్గా వుంది కానీ డ్రెస్ డిజైన్ మాత్రం బ్రష్ ని రంగుల్లో ముంచి దుస్తుల్లో చిలకరిస్తే ఎలా వుంటుందో అలాగన్నమాట. అంత దాకా ఎందుకు ఒక సాదా బట్ట పరిచేసి, చిన్నపిల్లలా చేతికి రంగు డబ్బాలు, పెయింట్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్లు దీన్ని పెయింట్ చేయండి అని వదిలేస్తే ఎలాగుంటుందో అంత చక్కగా అన్నమాట. బ్రష్ స్ట్రోక్ కలర్ ప్రింట్ జాకెట్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అంటే దాన్ని ఇంత అద్భుతంగా విష్కరించాలని అర్ధం చేసుకోవాలి. మోడరన్ పెయింట్ లో ముక్కు మొహం వెతికినట్లు వుంటుందీ డ్రెస్ వ్యవహారం కానీ కొత్త డిజైన్, అందుకే అందమైన యూత్ ధరిస్తే ఈ బ్రష్ స్ట్రోక్స్ కి కూడా కొత్త కళ వచ్చింది.
Categories