మోనోపాజ్ దశలో ఆరోగ్యంలో వచ్చే మార్పులను తగ్గించుకోవాలంటే సరైన ఆహారం ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. ఈ దశలో శరీరంలోలో తగ్గే ఈస్ట్రోజన్ హార్మోన్ ను సహజమైన ఆహారం ద్వార పొందవచ్చు. సోయ ఉత్పత్తులు, కాల్షీయం పుష్కలంగా ఉండే పాలు , పాల ఆధారిత పదార్ధాలు, ఆకుకురలు, నట్స్, నూనె గింజలు, చిరు ధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. పసుపు, నారింజ వర్ణంలో ఉండే కూరగాయలు , పండ్లు, నిమ్మ,జామ విటమిన్ ఇ దోరికే వంటనూనెలు , నువ్వులు, పల్లీలు, బాదం, వాల్ నట్స్ మొదలైనవన్ని శరీరానికి ఈస్ట్రోజన్ అందిస్తాయి. ఇవన్ని ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Leave a comment