Categories
Wahrevaa

ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం.

చాలా మంది ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే వాళ్ళు కూడా గింజల్ని పట్టించుకోరు. ఉదాహరణకు అవిసె గింజల్లో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. వీటిని షేక్స్ లో కలుపుకొవచ్చు. ఇక పొద్దు తిరుగుడు గింజల్లో జింక్, ఐరన్ పుష్కలంగా దొరుకుతాయి. జొన్నల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ. కర్భూజా గింజల్లో ఇతర మసాలా ద్రవ్యాలతో కలిపితే మంచి మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తాయి. పుచ్చ గింజల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలు ఆరోగ్యం ఇచ్చే మంచి స్నాక్. మొక్కజొన్న గింజల్లో, దానిమ్మ, బొప్పాయి గింజల్లో తెల్ల నువ్వులు ఇవన్నీ మంచి విటమిన్లు, ఖనిజాలకు ప్రోటీన్ల కు ఆధారం. ఇవి ఆరోగ్యాన్నిచ్చేవె కనుక ఇవి రోజుకో స్పూన్ అయినా తినాలి.

Leave a comment