సముద్ర తీరాల్లో అందమైన గవ్వలు దొరుకుతాయి. ఈ శంఖం గవ్వలు అనేకమైన పరిమాణాల్లో రూపాల్లో కనిపిస్తాయి. వీటిలో సముద్రపు జీవులు ఉంటాయి. ఈ గవ్వలు కలిగి ఉండే జీవులని Mollusca అంటరు. సృష్టిలో 85 వేల రకాల గవ్వలు ఉన్నాయట. ఇవి బతికి ఉన్న జీవులే నత్త జాతికి చెందిన ఈ జీవులు అంటే మొలస్కాలు సముద్రం నుంచి సున్నం సేకరించి తమ పై భాగంలో నిల్వ చేసుకుంటాయి. ఇవి క్రమంగా రకరకాల గవ్వలుగా రూపం పోసుకుంటాయి. లోపల జీవి చనిపోయాక ఆ పెంకులు తేలుతు సముద్ర తీరానికి చేరుకుంటాయి. వాటిలో ఎంతో అందంగా కనపడే వాటిని మనం ఇష్టంగా ఏరుకుంటాం.