ఒకప్పుడు ఫ్యాంట్లు షర్టులు మ్యాచింగ్. ఇప్పుడు షర్టులు, చీరెళ్లు,లెగ్గింగ్స్ కూడా జతగా వాడుకుంటున్నారు. కాకపోతే రంగుల డిజైన్లు సరైనవి ఎంచుకోవాలి. ఉత్తరాదిలో చీరకు జతగా షర్టులు వాడుతున్నారు. బ్లవుజుకు బదులు పొడవాటి షర్టులు కుట్టించుకుంటున్నారు. లెనిన్,సాధా కాటన్ చీరెలకు లేత రంగు షర్టులు ఇప్పుడు ట్రెండ్ కూడా. ఆ లెటెస్ట్ ట్రెండ్ అందరికి నప్పుతుంది కూడా. చొక్క కాలర్ భిన్నంగా ప్రయత్నిస్తే ఫ్యాషన్ గా ఉంటుంది. మెడ కాస్తా పొడుగ్గా ఉంటే మెన్స్ కాలర్, సన్నగా పొట్టిగా ఉంటే చైనీస్ కాలర్ ,వీ నెక్ కాలర్స్ కూడా అన్ని వయసుల వరకు హుందాతనం ఇస్తాయి. షర్టులు కొంచెం భిన్నంగా కనిపించాలంటె ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు కూడా.

Leave a comment