కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సామాజిక అసమానతలను రూపుమాపటం ఇవేనా ప్రాధాన్యాలు అంటూ ప్రకటించారు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్. (Jacinda Ardern) దేశంలో అతి చిన్న వయసురాలైన ప్రధాన మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. తాజా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆమె భారీ మెజార్టీ లో మళ్లీ గెలిచాక మాట్లాడుతూ నేను ఆచరణాత్మకమైన ఆదర్శ వారిని ఎప్పుడూ ఉత్తమమైన దానికోసం ప్రయత్నిస్తున్నాను అన్నారు జెసిండా కరోనా పోరాటంలో ఆమె తీసుకున్న చర్యలు అంతర్జాతీయంగా మన్ననలు అందుకున్నాయి. ఉక్కు మహిళగా పేరు తెచ్చాయి 50 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య కేవలం పాతిక. న్యూజిలాండ్ నగరంలోని హామిల్టన్ నగరంలో 1980లో మధ్యతరగతి కుటుంబాలు జన్మించిన జసీనా ప్రధానమంత్రిగా ఎదిగిన క్రమం గొప్ప విజయ గాధ.