Categories
పొడవాటి జుట్టు కోరుకుంటే అద్భుతమైన ఎక్స్ టెన్షన్లు దొరుకుతున్నాయి. జుట్టు పొడవు కోసం కొత్త కలర్ జత చేసేందుకు కుడా ఎక్స్ టెన్షన్లు వాడుతున్నారు. ఇందులో సింధటిక్ ఎక్స్ టెన్షన్స్ కొంత చౌక. హీటింగ్ స్టయిలింగ్ కు పనికి రావు గానీ తాత్కాలికంగా రెండు నెలల పాటు వాడుకోవచ్చు. రెండవది సహజమైన వెంట్రుకల క్వాలిటీతో సంవత్సరం వరకు బావుంటాయి. సులువుగా స్టయిలింగ్ చేసుకోవచ్చు. ఇక రెమీ ఇది నాణ్యమైన క్వాలిటీ. సహజంగా వుండే స్వచ్చమైన కెమికల్ గా ట్రీట్ చేయని వెంతుకలు జుట్టు కుదుళ్ళలో అమర్చుకుంటే సహజంగా కనిపించి చిక్కులేకుండా ఎంతో బావుంటాయి. ఎక్స్ టెన్షన్లు పరిశుబ్రంగా వుంచుకోవాలి. ప్రత్యేకంగా తయారు చేసిన షాంపూ వాడాలి. హ్యూమన్ హెయిర్ ఎక్స్ టెన్షన్లు మరింత జాగ్రత్తగా ఉపయోగుంచాలి.