Categories

14 సంవత్సరాల జహాన్ గీత్ సింగ్ . డోల్ వాద్య కళా కారిణిగా ప్రసిద్ధి పొదింది . దేశ విదేశాల్లో వందలాది లైవ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చింది . సోషల్ మీడియాలో రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. డోల్ గర్ల్ ఆప్ ఇండియా గా పేరుతెచ్చుకొన్న జహాన్ ఈ వాయిద్యం నేర్చుకునేందుకు ఎంతో కష్టపడింది . డోల్ చాలా పెద్దగా బరువు గా ఉంటుంది . ఆ వాయించే శబ్దం,బీట్ కి తట్టుకొని నిలబడాలంటే ఎంతో స్టామినా కావాలి . గంటల కొద్దీ జిమ్ లో అవుట్స్ బాడీ ఎక్సర్ సైజులు చేసి ,శక్తి పెంచు కొనేందుకు రెండేళ్ళ పాట కష్ట పడింది . ఈ కళ లో ప్రావీణ్యం పొంది ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ వేదికల పైన తన ప్రత్యేకతను చాటుకొంటోంది .