అనుష్క ఎప్పుడూ అందంగానే ఉంటుంది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్కచాలా కాలం పాటు అలా బొద్దుగానే కనిపించింది. ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు చాలా సన్నగా, మునుపటి కంటే కూడా ఇంకా అందంగా కొత్త లుక్ తో సామాజిక మధ్యమాల్లో కనిపించింది. శ్రద్ధగా నిపుణుల సమక్షంలో బరువు తగ్గేందుకు దృష్టి పెట్టిన అనుష్క ఫోటోలు ట్విట్టర్ లో కనిపించాయి. త్వరలో ఆమె ఒక కొత్త చిత్రంలో నటించబోతుంది. కాస్త కష్టపడితే శరీరం మన కంట్రోల్ లో ఉంటుంది అని చెప్పకుండానే చెపుతోంది. ఆమెను జాజిపూవుతో పోల్చి తమ సంతోషం తెలియజెప్పారు నెటిజన్లు..