Categories

– డి.సుజాతా దేవి
మల్లితో నీ ఆసికాలు
వల్ల కాదురా
సెల్లని మాటాడితేనే
నొల్లకోనురా మావ
నల్ల కోనురా!!
సందమామ మొకమంటె
సందమా అందమా
నల్ల మచ్చలా మొకమా
మల్లికి సాటి మావ
మల్లికి పోటి !!
సుక్కలు నా కళ్ళంటె
సక్కదన మదేటి
తిక్కలోడ పగటేళ
సుక్కల మెరుపేడర !!
సిలక పలుకులంటే గొప్ప
కులుకా సంబడమా
పలుకు నేర్సెనే గాని
పాటలొచ్చునా సిలకకు
పాట లొచ్చునా !!