బయమేత్తందో అమ్మో బతకడానికి

అమ్మో !
బయమేత్తందో రన్నో బతకడానికి
మనసులేని మనుషుల మద్దిన మసలడానికి
కలిసి బతకడానికి !!

నవుతానే నామం బెడతరు
ఏడుత్తా దణ్ణం బెడతరు
కడుపునిండా కళ్లు యిసము
మాటల్లో తేనెలు బోత్తరు !!

నీతికి నిలబడినోడంటే
శాతగాని యదవంటారు
కోతలతో కాలం గడిపే
పోతులకే కురిసి లేత్తరు !!

గుప్పెడు మెతుకులు ఇదిలిస్తే
ఎప్పుడూ పడివుంటది కుక్క
అన్నమెట్టినోడి నేతినే
ఆరగింప జూత్తడు మణిసి !!

పాము అంటే పక్కకు బోతము
పులి వత్తె ఎదుట బడము
మణుసుల్లో జంతువులుంటే
మనకెట్టా తెలుసుద్దమ్మో!!

          – డి.సుజాతా దేవి

Leave a comment