Categories
సివ్వుమనే సీకటిలో
సిక్కడె ఒంటరి మనసు
ఏ దారి లేకపోయేరా ఓరన్నా
మిగిలింది గోదారిరా !
కాళ్ళ కింద నిప్పులోసి
నెత్తిన సన్నీళ్లు…
కక్కలేని మింగలేని
గొంతుక గుక్కిళ్ళు
బతుకే నాటకమాయెరా ఓరన్నా
తుదీ మొదలు లేకపోయెరా !
తెల్లని నురగల అలలు
తిమింగలాలు లోన
తేలెను రంగుల నావలు
ఆగాధాల పైన
బతుకే సుందరమాయెరా ఓరన్నా
– డి.సుజాతా దేవి