Categories

-డి. సుజాతాదేవి
నా ఎంట రావద్దు సందమామా
మా ఇంట నువ్వుండు సందమామా
మల్లికెంతో మనసు
నువ్వన్న నే నన్న
సందమామవు నువ్వు
మల్లి మామను నేను!!
మల్లి పందిరి పక్క
మా పడక గది వుంది
తొంగి చూశావంటె
తొంగినుంటది మల్లి!!
నా కళ్ళలో నువ్వు
నీ కళ్ళలో మల్లి
ఎడము లే దిద్దరికి
ఎన్నె లొకటై వెలగ!!