Categories
నైనిటాల్ లోని హల్దవాని లో లక్ష్మీ తండ్రి కూలి పనులు , సిక్షాతన తో జీవించేవాడు. జీతీయ సమైక్యత దినం రోజున పరిసుబ్రత పై రామ్ లీలా మైదానం లో పెద్ద సమావేశం జరుగుతుంది. అక్కడ తిరుగుతున్నా లక్ష్మీ ఎవరో పారేసిన అరటి తొక్కని పట్టుకు పోయి డస్ట్ బిన్ లో వేసింది. అధికారులు చూశారు. ఈ సంఘటనే. ఆ పాపను హాల్దవాని మునిసిపల్ కార్పోరేషన్ పరిశుభ్రతా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా చేసారు. లక్ష్మీ చేసిన ఈ చిన్న పని ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చేదిగా వుందని పర్యావరణ వేత్తలు మెచ్చుకున్నారు. ఇప్పుడా బాలిక కుటుంబానికి సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు.