నీహారికా,

బాల్యం మనకు జీవితాంతం పదిలంగా మిగిలే అమాయకపు రోజుల జ్ఞాపకం. అప్పుడు ఏ క్షణంలో ఏది దొరికితే దాన్ని ఆ నిమిషంలో ఎంజాయ్ చేస్తాం. కానీ ఎదిగే కొద్దీ ఈ నడుస్తున్న క్షణాల్లో దొరికే ఆనందం మాయమైపోతుంది. చేతిలో ఉన్న ఈ క్షణాన్ని వదిలేసి భవిష్యత్ గురించిన బెంగల తోనే గడిపేస్తూ పోతాం. కానీ మనం పోగొట్టుకున్న బాల్యంలో మనం ఆనందపడ్డ క్షణాలు ఎప్పటికీ వెనక్కి తెచ్చుకోలేం. కానీ ఆలోచిస్తే అలా ఆనందించటం ఒక వరం కదూ. చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఉన్దిచ్చు గాక, నూరు శాతం సంతోషాన్ని అందిపుచ్చుకోగలగటం కూడా ఒక సామర్ధ్యమే. స్వయంగా దాన్ని మనం హైలైట్ చేసుకోగలగాలి. వర్తమానంతో జీవించగల అలవాటును, ఎంతో యుద్ధం చేసే ప్రాక్టీస్ చేసి సాధించగలిగితే ఎంత బావుంటుంది. ఆలోచనల పట్ల మంచి ఎవేర్నెస్ తో వుంటే ఇదేం పెద్ద కష్టం కాదు. మన చేతికి అందిన ఎలాంటి జీవితాన్నయినా ఎంజాయ్ చేసే సమర్థతతో వుంటే, ప్రతి నిముషం దొరికే ప్రతి ఆనందాన్ని ఎంజాయ్ చేయగలం ఒక ఉత్సవ సౌరభం తో జీవితం గడపటం అంటే ఇదే. అంటే ఒక పండుగ లాగా లైఫ్ ని మలుచుకోవాలి. ప్రతి నిత్యం పండగ, ఆనంద పడే పండగ. ఆ సువాసనని జీవితంలోకి తెచ్చుకోగలిగితే సంతోషంతో పొర్లిపోయే బంగారు పాత్ర =వంటి జీవితం అనుభవంలోకి వస్తుంది.

Leave a comment