Categories
WoW

ఇవి చల్లదనాన్ని ఇచ్చే ఆహారం.

శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేవి కొన్ని పదార్ధాలు తప్పని సరిగా తీసుకుంటే వుంటే అనారోగ్యాలు దగ్గరికి రాకుండా ఉంటాయి. పెరుగులో శక్తినిచ్చే కార్బోహైడ్రేడ్స్ సమృద్దిగా లాభిస్తాయి ప్రోటీన్స్ కు పవర్ హౌస్. ఎముక పుష్టిని ఇచ్చే కాల్షియం ఉదరానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ లభిస్తాయి. ప్రతి రోజు తప్పకుండా ఓ గిన్నెడు పెరుగు తింటే అలసట, డీహైడ్రేషన్ ఉదర సమస్యలు రావు. క్యాలరీలు తక్కువ, ఉదరం పై వత్తిడి లేకుండా చేసే లెట్యుస్ కూడా చాలా మంచివి. అలాగే మధ్యాహ్నం వేళ ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే పెసర మొలకలు మంచి పోషకాలు, పీచు సమకూరుతుంది. శరీరానికి శక్తి దొరుకుతుంది. ప్రతి రోజు బార్లీ గింజలు వేసిన నీటిని తాగితే డీహైడ్రేషన్ వుండదు. చర్మం నిగారింపుగా వుంటుంది. ఇక నుంచి మూడ్ కోసం తాజా పుదీనా ఆకులూ తిసుకోవాలి. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి.

Leave a comment