తెల్లవారి నిద్ర లేవగానే ఉత్సహంగా లేకపోతే ,తలనొప్పి అనిపిస్తే శరీరంలో నీటి శాతం తగ్గిందనుకోండి అంటున్నారు అధ్యయనకారులు . ఆరుగంటల సేపే నిద్రపోయినా లేదా ముందుగానే లేచినా ఈ సమస్య వస్తోంది . రాత్రివేళ నిద్రించే సమయంలో పియూష గ్రంధి వాసో ప్రాసెస్ అనే హర్మన్ ను విడుదలయ్యేలా చేస్తుంది . ఇది మూత్రపిండాలు మూత్రాన్ని పట్టివుంచేలా చేయగలదు . ఒంట్లోంచి ద్రవాలు బయటకి పోనివ్వకుండా చేస్తుందన్నమాట . గాఢనిద్రలో నే ఈ వాసో ప్రెసిన్ ఎక్కువగా తయారవుతుంది . ముందుగానే నిద్ర లేస్తే ఇది కిడ్నీలకు అమితంగా చేరుకోలేరు . అవి మూత్రాన్ని పట్టివుంచలేక పోతాయి, ఫలితంగా  నీటిశాతం తగ్గుతుంది కంటినిండా నిద్రపోతే ఆరోగ్యాంగా ఉంటారని చెప్పటంలో మర్మం ఇదే  . కనీసం 7 గంటల నిద్ర కావాలి . ఈ నిద్ర తగ్గితే నీరు తగ్గిపోతుంది జాగ్రత్త అంటున్నారు .

Leave a comment