మీటూ ఉద్యమ ప్రభావం ఇప్పుడూ పోలీస్ డిపార్ట్ మెంట్ ను తాకింది. ముఖేష్ అగర్వాల్ అనే సీనియర్ ఐ.పి.ఎస్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ లీనా డోలి అనే అస్సాం మహిళ పోలీస్ అధికారి ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సెషన్ అయింది.నన్ను అగర్వాల్ తనతో బయటికి రమ్మన్నాడు.అతని ఉద్దేశ్యం అర్థమైంది నో అని చెప్పేశాను . ఇక వేధింపులు మొదలయ్యాయి. ఆర్నెల్లకు నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేస్ పై వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్ అది ఒత్తిడితో ఆత్మహత్య చేసుకొన్న కేస్ కాదని చెప్పేశాడు.ఇక దానిపై వాచారణ జరగలేదు.అగర్వాల్ తన తప్పును ఒప్పుకున్నాడు ఒక దశలో . కానీ అతని భార్య నేనతన్ని వేధిస్తున్నానని కేస్ వేసింది. నేను రిట్ పిటిషన్ దాఖలు చేశాను.ఎంత దారుణం,నేను నాభర్యను పోగొట్టుకొన్నాను. ఈ కేస్ లు ,ఎంక్వైరీలు ,నాపై వేధింపులు ఇవన్నింటిలో నా పిల్లలపై కూడా నేను ఎలాంటి ప్రేమ,ఆధారణ ఇవ్వలేకపోయనని లీనా డోలీ ఫేస్ బుక్ పోస్టులో తన ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a comment