వేలాది మంది వైద్యులు నడక సిఫార్సు చేస్తారు. జాగింగ్ కంటే స్పీడ్ వాక్ మంచిదంటారు. 20 నుంచి 40 నిమిషాల నడకను వారంలో నలుగు సార్లు లక్ష్యంగా పెట్టుకున్నా ఎన్నో ప్రయోజనాలున్నాయి. నడకకు కొన్ని రూల్స్ పాటించాలి. సరైన పోశ్చర్ వుండాలి. చుబుకం పైకెత్తి తిన్నగా ముందుకు చూస్తూ నడవాలి. ముంజేతుల్ని లుజ్ గా కిందకు వదిలేసి ఉండక ముందుకీ వెనక్కి బాగా కదిలిస్తూ నడవాలి. మోచేతులు 90 డిగ్రీలుగా రిలాక్డ్ గా వదిలేసి నడుము నుంచి ఛాతీ దాకా వచ్చేలా తిన్నగా కదిలేలా నడవాలి. ఇలా చేతులు ఊపుతూ శీఘ్రంగా నడిస్తే పై భాగం శక్తి పెరగడం కాక వెళ్ళు వాపులు రావు. ఉదర కండరాళ్ళు కుడా సరైన పోజిషన్లో ఉంటాయి. వేగంగా నడవలేక పొతే ఇంటర్ వెల్స్ తీసుకోవచ్చు. ఫిట్నెస్కు ఉపయోగపడే పద్దతి ఇదే క్యాలరీలు సంతృప్తికరంగా కరిగించాలంటే కనేసం గంటకు 72 కిలోమీటర్లు నడవాలి. అంటే నడకలో అంట వేగం ఉండాలన్న మాట. క్రమమం తప్పకుండా చేస్తుంటే నడక వేగం పెరుగుతుంది.
Categories