Categories
బెంగాల్ కు చెందిన జోయితా మండల్ మొదటి ట్రాన్స్ ఉమెన్ మహిళా జడ్జ్. సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన జోయితా ఎంతో వివక్షను ఎదుర్కొన్నారు. పదవ తరగతి లోనే ఆమెనూ స్కూల్ నుంచి పంపేశారు. బస్ స్టాండ్ ల్లో నిద్రిస్తూ వీధుల్లో భిక్షాటన చేశారు జోయితా కరస్పాండెంట్ కోర్స్ తో న్యాయవాది అయ్యారు. 2010లో ట్రాన్స్ జెండర్ గా ఓటర్ ఐడి కార్డ్ పొందిన మొదటి వ్యక్తి జోయితా దినాజ్పూర్ న్యూ లైట్ పేరుతో ఎన్జీవో స్థాపించి వేల మంది ట్రాన్స్ లకు సాయం గా ఉన్నారు జోయితా.