ముఖం మెరుపుతో కాంతిగా కనబడేందుకు ఖరీదైన సౌందర్య సాధనాలు వాడాలని నియమం ఏమీ లేదు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారా చర్మం అందంగా, తాజాగా కనిపిస్తుంది అంటున్నారు  న్యూట్రిషనిస్ట్ లు.బీట్ రూట్ జ్యూస్ మేని సౌందర్యాన్ని పెంచుతోంది అంటున్నారు.బీట్ రూట్, కొత్తిమీర, ఉసిరి ఈ మూడింటినీ మిక్సీ లో వేసి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి.ఈ రసంలో బీటా లైవ్స్   అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒంట్లోని విష పదార్ధాలను తొలగిస్తాయి ఉసిరిలో సి-విటమిన్ ముఖంపై మచ్చలు ముడతలు పోగొడుతుంది.చర్మానికి తేమను అందిస్తుంది వ్యాయామం తర్వాత ఈ జ్యూస్ తాగితే అలసట తగ్గి కండరాలు స్వాంతన పొందుతాయి.

Leave a comment