చుడీదారులు లెహంగాలు ఏ వస్త్ర స్రేణి అయినా నిండుతనం రావాలి అంటే జుంకీలు అలంకరించుకోవాలి. ముత్యం , పగడం , గోమేధికం , కుందన్లు పొదిగిన బంగారు జుంకీలు ఎన్నో ఆకారాల్లో అందంగా తయ్యారు చేస్తున్నారు. టెంపుల్ జ్యువెలరీ తో పాటు పువ్వుల డిజైన్లు , నెమళ్ళు రకరకాల డిజైన్లు ఎంచుకోవచ్చు. వెండితో తయారు చేసిన ఆక్సిడైజ్ అయ్యిన జుంకీలు , వీటినే గుజరాతీ స్టయిల్ జుంకాలు అంటారు. ఇవీ ప్యాన్సీ డ్రెస్సులకు మ్యాచింగ్ గా వుంటాయి. ఇక డిజైనర్ దుస్తులకు వజ్రాల జుంకీలు , ఏదైనా ప్రెత్యేకమైన అకేషన్ కోసం పొడవాటి ముత్యాల చెయిన్ తగిలించి ఉండే కాశ్మిర్ జుంకాలు చక్కగా వుంటాయి.


Leave a comment