Categories
మందులు వాడటం వల్ల జుట్టు పెరిగే అవకాశం లేదు.అంటున్నారు ఎక్స్ పర్ట్స్.వయసు పెరిగే కొద్ది సహజంగా జుట్టు రాలుతుంది. మందులతో పొట్టి జుట్టు పొడుగు అవ్వదు. జన్యుపరంగా పొడుగు జుట్టు పుట్టకతోనే వస్తుంది.మానసిక శారీరక ఒత్తిడులు జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.హర్మోన్లు అసమతౌల్యం జుట్టు ఎదుగుదల పైన రాలిపోవడం పైన ప్రభావం చూపిస్తుంది.అండ్రోజన్స్ అనే హర్మోన్ ప్రభావంతో జుట్టు పెరుగుతుంది.థైరాయిడ్ హార్మోన్ ఎక్కువయినా తక్కువయినా జుట్టు ఊడిపోతుంది.వైరల్ ఇన్ ఫెక్షన్లు బాక్టీరియల్ ఫంగల్ ఇన్ ఫెక్షన్ల్లో జుట్టు ఊడిపోతుంది.పై పైన రాసే నూనె వల్ల షాంపూల వల్ల కూడా ప్రయోజనం శూన్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మంచి ఆహారం,చక్కని నిద్ర జుట్టుని కాపాడతాయి.