Categories
ఢిల్లీ లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ శరణార్థుల శిబిరం లో తలదాచుకున్న మహిళలకు జీవనోపాధి కోసం సిలైవాలి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పారు ఐరిష్ స్ట్రిల్ తన భర్త బిశ్వదీప్ తో కలిసి ఢిల్లీలో పోగుపడే చెత్త వ్యర్థాల నుంచి ఫ్యాబ్రిక్ వేస్ట్ ను రీసైకిల్ చేసి వాటితో కళాకృతులు చేసేందుకు గాను అఫ్గాన్ మహిళలకు శిక్షణ ఇచ్చాము.వారు తయారు చేసిన క్లాత్ బొమ్మలు, పర్స్ లు వాల్ హ్యాంగింగ్స్ కు 150 దేశాల్లో డిమాండ్ ఉంది.ఈ బొమ్మలు ఆ స్త్రీల కథలు చెబుతాయి అంటారు ఐరిష్ స్ట్రిల్.400 మహిళలు ఈ బొమ్మల తయారీ నేర్చుకొని ఉపాధి పొందుతున్నారు.