ఇల్లు అలంకరించటంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా గృహాలంకరణ సామాగ్రి గాజు,పింగాణీనే అందంగా కనిపిస్తాయి. కానీ ఇవి అతి జాగ్రత్తాగా చూసుకోవాలి కానీ కాగితాలతో కళాకృతులు తయారు చేస్తేమటుకు అవి ఎక్కడైనా ఎలా అయినా వాడచ్చు. చిన్న చిన్న పూవులతో మొదలై వాల్ డెకరేషన్ వరకు ఎదిగిన ఈ ఆర్ట్స్ నేర్చుకొనేందుకు ఓ కోర్స్ ఉంది. అదే ఓరిగామి ఇది జపాన్ జానపదకళ .జపాన్ లో ఓరిగామి అంటే కాగితం మడతపెట్టటం అని అర్థం వస్తుంది. ఈ ఆర్ట్స్ నేర్చుకొంటే కాగితం ఒక పేపర్ కళారూపం అవుతోంది. అలాగే క్విల్లింగ్ ఆర్ట్స్ కూడా దీన్ని పేపర్ ఫిలిగ్రీ అంటారు. రంగు రంగుల క కాగితాలు ఇంటిని అలంకరించే ఫ్రేమ్స్ వాల్ హాంగింగ్స్ చూస్తే ఫ్లవర్స్ పిల్లల బొమ్మలు తయారు చేయవచ్చు.

Leave a comment