మనం ఇచ్చే ఆహారంలోనే ఆరోగ్యం దాగి వుంటుంది పిల్లల్లో ఎలర్జీలు ఆస్మా వంటివి రాకుండా ఉండాలంటే వారికి చిన్నతనం నుంచి తాజా కూరగాయలు పెట్టాలి. బీన్స్, టమాటో, దోసకాయ వంటి కూరగాయలు బాగా తీసుకుంటే పిల్లల్లో ఎలర్జీలు వచ్చే అవకాశం 50 శాతం తక్కువగా వుంటుంది. వాళ్ళకి అన్ని రకాల రుచులు అలవాటు చేయాలి. అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు తినిపించడం ద్వారా పిల్లలకు ఆరోగ్యవంతమైన పోషకాలు అందుతాయి. వారికి సీజనల్ గా వచ్చే జలుబు, జ్వరం వంటివి రాకుండా ఉంటాయి. చిన్నపాటి వ్యాయామం అంటే ఆరు బయట ఓ అరగంట పాటు అయినా అడుకోనిస్తే మంచి ఆహారం అందిస్తే పిల్లలు చక్కగా పెరుగుతారు.

Leave a comment