ఇల్లే ఆఫీసర్ గా మారిపోయిన రోజులవి కరోనా భయం తో బయటికి వెళ్లే దారి లేదు అందరూ ఇంట్లోనే ఇటు ఆఫీస్ ఇంట్లో పని పిల్లల చదువులు పూర్తి చేయాలి. ఉన్న ఇంటినే సరిగ్గా డిజైన్ చేసుకోమంటున్నారు  ఎక్స్ పర్ట్స్. పిల్లల గదిలో వాళ్లు చదువుకునే వస్తువులు అందుబాటులో ఉంచుకొనే లాగా  క్లాత్  హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయాలి.చిన్న సంచులుగా ఉండే ఈ హ్యాంగింగ్స్ లో పెన్ను బుక్స్ పెన్సిళ్ళు ఎరైజర్స అన్ని అందుబాటులో ఉంచుకొనేలా పెట్టుకోవచ్చు.కంప్యూటర్ టేబుల్ అమర్చే వీలు కాకపోతే  డిజప్పీర్ టేబుల్ ను అమర్చు కోవాలి అవసరమైనప్పుడు ఉపయోగించి పూర్తయ్యాక టేబుల్ గోడకు అమర్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కళ్ళకు శాంతి నిచ్చే ఇండోర్ మొక్కలను వర్టికల్ పద్ధతిలో పెంచుకునేందుకు స్టాండ్ లు దొరుకుతున్నాయి. గది మూలల్లో ఈ స్టాండ్ లు అమర్చుకుంటే చక్కగా ఎండ అవసరం లేని మొక్కలు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి.

Leave a comment