లాక్ డౌన్ ఎప్పుడూ లేనంత విశ్రాంతి సమయాన్ని ఇచ్చింది.ఈ సమయాన్ని ఎంతో శ్రద్ధగా ఒక నెరవేరని కలని నిజం చేసేందుకు వినియోగించుకున్నాను అంటుంది నటి ఐశ్వర్య రాజేష్.నాకు మొదటినుంచి డాన్స్ చాలా ఇష్టం.క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని కలలు కనేదాన్ని.చదువు ఇంకా చిన్న ఉద్యోగాలు చేయటంతో అది సాధ్యం కాలేదు తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక డాన్స్ నేర్చుకోవడం కాలే అనుకొన్నా ఇంతలో ఈ లాక్ డౌన్ పీరియడ్ వచ్చింది. పూర్తి సమయాన్ని నృత్యం నేర్చుకోవటం లోనే గడిపేశాను.కరోనా కారణంగా నా కల నెరవేరుతోంది అని చెబుతోంది ఐశ్వర్య రాజేష్.కరోనా సమయం నిజానికి ఎంతో ఒత్తిడి తెస్తోంది. కొంది. కానీ ఐశ్వర్య మాత్రం దాన్ని అత్యంత సృజనాత్మకంగా వినియోగించుకొంది.