వారణాసి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు.ముందు ఆయన దర్శనం చేసుకుంటే కానీ స్వామి దర్శనం లభించదు.పూర్వం బ్రహ్మ తపస్సు చేస్తున్న సమయంలో మహర్షులు వెళ్ళి ఈశ్వర తత్వం గురించి అడిగిన అఙ్ఞన మాయ కమ్మి బ్రహ్మ తనను తాను సర్వస్వం అనీ,విష్ణుమూర్తి కూడాఅంతే అఙ్ఞానంగా ప్రవర్తించాడు.అది చూచిన త్రినేత్రుడు కోపంతో తన భృకుటి నుండి ఒక భయంకరమైన జీవిని  అనుమతిచ్చాడు.సకల లోకాలను, సర్వ రోగాలను,దుష్ట శక్తులను ఎదిరించడం కాలభైరవుని ప్రత్యేకత.బ్రహ్మ అయిదవ తల కాలభైరవుని చూచి నవ్వినందుకు భైరవుడు శిరస్సు ఖండించాడు.అయితే బ్రహ్మ కపాలం మాత్రం కాలభైరవ చేతికి అంటుకుపోయింది.ఇంత విశిష్టమైన, శక్తివంతుడైన కాలభైరవుడు కనిపిస్తే తప్పకుండా పూజించాలి.
నిత్య ప్రసాదం:కొబ్బరి,గారెలు

                -తోలేటి వెంకట శిరీష

Leave a comment