Categories
నీంద్ యాప్ సృష్టించింది సురభి జైన్. ఐ.ఐ.టి బాంబే లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సురభి కొన్ని వెంచర్స్ లో క్యాపిటలిస్టు గా, కన్సల్టెంట్ గా పనిచేసేది. కరోనా లో కొందరు స్నేహితుల్లో నిద్ర సమస్యను కనిపెట్టి చక్కగా నిద్ర పట్టేందుకు యాప్ రూపొందించింది. కరోనా తగ్గిన తర్వాత కూడా చాలా మందిలో ఎన్నో కారణాలతో నిద్ర సమస్య ఉంటూనే ఉండటంతో ఈ యాప్ ఆమె కెరీర్ గా మలుచుకుంది. ఇందులో ప్రేరణ కలిగించే కథలు విశ్రాంతి కలిగించే సంగీతం ఉంటాయి. ఈ యాప్ ఉచితం స్థానిక భాషలైన మరాఠీ, తమిళం, తెలుగు, బెంగాలీ లో కూడా ఈ యాప్ రాబోతోంది. రాజస్థాన్ లోని లావా అన్న చిన్న పట్టణంలో పుట్టిన సురభి జైన్ కు ఇక్కడ చదువుకునే సదుపాయాలు లేవు. జనాభా కేవలం ఐదు వేలు.