నీహారికా,

ఏది మందిలోకి వెళ్ళే సందర్బాలు ఎన్నో వస్తాయి. ప్రతి దానికి వెళ్ళాలి కూడా అందుకు ముందు స్నేహితులు, బంధువులు మధ్యకి వెళ్ళే సందర్బంలో పాటించిన మర్యాదలు నేర్చుకోవాలి. మనకు ఎక్కడ నుంచి అయినా ఆహ్వానం అందితే ముందుగా ఆ సమయానికి మనకు ఇంకేమన్నాముఖ్యమైన పనులుంటే, వెళ్ళలేకపొతే ఆ సంగతి మృదువుగా ముందే చెప్పేయాలి. అలాగే అతిధిగా వెళ్ళే సందర్బాలకు ఆ వాతావరణంలో కలసిపోయేలా వుండాలి. మా ఇంట్లో ఇంత కంటే బావుంటుందనో, సరైన సదుపాయం లేదనో లేదా చిన్న పాటి అసౌకర్యానికి మోహంలో ఫీలింగ్స్ మర్చేస్తేనో చాలా తప్పు. అసలా మాటలు అననే కూడదు. అక్కడే వున్న వాళ్ళు నీ ఆత్మీయులు. వాళ్ళని నొప్పించే పని చేయ కూడదు. ఇంకో ముఖ్యమైన విషయం . ఆహ్వానం అందుకొన్నాక మన అవసరం ఏమైనా వుందా అని సాయం కావాలా అని తప్పకుండా అడగాలి. వెంటనే ఆ సాయం చేసేందుకు సిద్ధ పడాలి. అవతల వాళ్ళ అభిరుచులు గమనిస్తూ వాళ్ళ వేడుకలో భాగం  పంచుకుని సాధ్యమైనంత మన వైపు నుంచి సాయం అందిస్తే మనకన్నా మంచి అతిధి ఇంకొళ్లుండరు.

Leave a comment