పుట్టగొడుగులు నుంచి పోషక విలువలున్న శక్తి ఇచ్చే ఆహారం సాధారణంగా వీటిని సూప్ లు, సలాడ్ లు, సండ్ విచ్ లేదా ఆకలి పుట్టించే సూప్ లుగా తాయారు చేస్తారు. ఎక్కువగా పౌష్టికాహార ఉత్పత్తుల్లో స్పోర్ట్స్ డ్రింక్స్ లో ఉపయోగిస్తారు. వీటిల్లో 80 శాతం నీరు తక్కువ కేలరీలు సోడియం, ప్యాట్ కూడా చాలా తక్కువ. పొడిగా వుండే పుట్ట గోడుగుల్లో ఫైబర్ 8 నుంచి 10 శాతం వుంటుంది. ఒక అరటి పండు లేదా, బత్తాయి రసంలో లభించే పొటాషియం కంటే కొంత తక్కువే వీటిలో లభిస్తుంది. రోజుకు ఒక్క సారి పుట్టగొడుగుల కూర తింటే ఆ రోజుకు అవసరమైనంత రాగి ఇందులో దొరుకుతుంది. పుట్టగొడుగుల్లో ఇంకా రిబో ఫ్లానిన్, నియాసిన్, సిలికానియం ఉంటాయి. సిలీనియం విటమిన్-ఇ తో కలిపి ప్రీరాడికల్స్ నుంచి కణజాలన్నీ రక్షించడానికి పోరాడుతుంది.
Categories