నీహారికా, పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నప్పటి కబుర్లు చెప్పుతారు చూడు అందులో ఎక్కువగా భోజనాల కబుర్లు ఉంటాయి. ఆవకాయ పెట్టిన రోజు కలిప్న ఆవకాయ బేసిన్ లో అన్నం కలిపి అందరం తినేవాళ్ళమనీ, వన భోజనాలనీ, పెళ్ళిళ్ళని, అరిసెలు పండక్కి చేసుకునే వాళ్ళమని ఇలా అన్నో చెప్పుతారు. ఎన్నో అనుభందాలు భోజనాల బల్ల చుట్టూ అల్లుకుని ఉంటాయి. చివరకు అమ్మా గురించి మాట్లాడినా అమ్మ చేతి వంట అంటాము. అంటే ఈ భోజనం చుట్టూ మన కుటుంబ సభ్యులని తలుచుకుని ముచ్చట్లు వున్నట్లేగా. ఇప్పుడు ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నట్లు ప్రతి రోజు కలిసి భోజనాలు చేయండి. ఇంట్లో అందరు ఎవరి పనుల పైన వాళ్లున్నా, చివరికి ఏ రాత్రి వేళనో అందరు కలిసి తిని కబుర్లు చెప్పుకుంటే ఈ బిజీ జీవితంలో కుడా కుటుంబ సభ్యుల మధ్య ఆ కాసేపు గడువులా మాట్లాడుకుంటే బావుంటుందని. ఆ సమయం చాలా విలువైనదిగా భావించాలని అర్ధం. ఎంత పని వత్తిడి లో వున్నా కుటుంబ ప్రధాన్యతని విస్మరించ వద్దని చెప్పే పెద్ద వాళ్ళ సలహా గురించి ఆలోచించ లేదేమో కదా.
Categories