బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు కూడా విండో షాపింగ్ చేస్తూ వుంటారు . అలాగే హోటల్లో దొరికే అన్ని రకాల పదార్ధాలను ప్రదర్శనకు పెడితే బావుంటుందననుకున్నాడు జపాన్ కు చెందిన రెస్టారెంట్ యజమాని. రంగులద్దిన మైనంతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలను నోరూరించేలా దృష్టిని ఆకర్షించేలా తయారుచేయించాడు. అప్పటినుంచి రెస్టారెంట్ లో పదార్ధాల ప్రదర్శన మొదలైంది . ప్లాస్టిక్ తో రకరకాల ఆహార పదార్ధాల నమూనాలు తయారుచేసే కంపెనీలు వెలిసాయి. ఇప్పుడది కోట్ల విలువ చేసే మార్కెట్. జపాన్ ,కొరియా ,చైనా రెస్టారెంట్లలో కొత్తకొత్త రకం పదార్ధాల నమూనాలు పెడితే మెనూ పైన చదివి కాకుండా ఇలా కళ్ళతో చూసి ఆర్దరించేందుకు కస్టమర్లు ఇష్టపడుతున్నారట. అచ్చమైన వంటకాలకంటే ఇంకా నిండైన రూపంలో ప్లాస్టిక్కో ,మైనంమో ఏదైనా కనిపించే ముందు నోరూరటం ఖాయం. పోనీ తినేద్దామనుకోవటం కస్టమర్స్ బలహీనతే కదా.
Categories