అష్టాదశ శక్తిపీఠల గురించి ఎంత చెప్పినా తక్కువే.జగన్మాత, ఆదిపరాశక్తి,జగత్జనని అయిన పార్వతి దేవిని కామాఖ్యాదేవిగా మనం పూజలు చేసి తరించాలి.
అత్యంత శక్తివంతమైన,ప్రత్యేక దినాలలో మగవారికి అనుమతించని ఏకైక ఆలయం.
పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూదేవీల పుత్రుడు నరకాసురుడు.ఈ కామాఖ్యాదేవి ఆలయంను నరకాసురుడే నిర్మించాడు.దక్ష యఙ్ఞంలో అవమానాల పాలైన పార్వతీ దేవి అగ్నికి ఆహుతి అయ్యింది అని తెలుసుకొనిన శివుడు ఉగ్ర రూపంతో తాండవం చేస్తున్న సమయంలో ఈ ప్రదేశం లో పార్వతీ దేవి యొక్క యోని భాగము పడింది కావున కామాఖ్యాదేవిగా పూజలు అందుకుంటోంది.
నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి
-తోలేటి వెంకట శిరీష