స్వదేశి వ్యవసాయ విధానంపై ప్రజల్లో అవగాహన కలిగించారు కమలా పూజారి. ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా పత్రిపూటా కమలా స్వగ్రామం. అంతరించిపోయే దశలో ఉన్న దేశ వరి వంగడాలను దశాబ్దాలుగా సంరక్షిస్తున్నారు. పసుపు,నువ్వు ఇతర పంటలను రసాయణ సేధ్యం నుండి కాపాడారు.అమాయక గిరిజనులను ప్రకృతి సేధ్యం వైపు నడిపించారు. సేంద్రియ వ్యవసాయం గోప్పదిగా నమ్మి ఆచరించారు కమలా . రైతు సంఘాలను ఎర్పాటు చేసి సేంద్రియా వ్యవసాయం చేసేలా ప్రోత్సహించారు. ఒడిస్సా ప్లానింగ్ బోర్డు లో సభ్యురాలు ఈవిడ. ప్రజా సమస్యలపై ఈమేకు లోతైన అవగాహన ఉంది .ఆమేకు పద్మశ్రీ పురస్కారం లభించింది.