Categories
నడక కంటే అన్ని విధాలా మెరుగు, మెట్లెక్కి దిగడం అంటారు ఎక్స్ పర్ట్స్. నడక తో ఖర్చయ్యెకాలరీల కంటే రెండింతలు కరిగిపోతాయి. కళ్ళలో విభిన్నమైన కండరాలకు పని చెప్పినట్లు అవ్వుతుంది. కాలి మదమల్లో కండరాలకు కుడా చక్కని వ్యాయామం మెట్లెక్కుతూ పక్కన వున్న రెయిల్స్ పై చేతుల్ని మోపుతూ నడిస్తే ముంజేతులు, బుజాల్లోని కండరాలకు ఎక్సర్ సైజ్ లభిస్తుంది. కండరాలకు మంచి స్ట్రెంగ్త్ ఎముకలు బలంగా పెరుగుతాయి. గుండె ఊపిరి తిత్తులు బలోపేతం అవ్వుతాయి. గుండెకు ప్రయోజన కరమైన హార్మోన్లు విడుదలవ్వుతాయి. అయితే ఇతర కీళ్ళ నొప్పుల సమస్యలు. బుజాలు, మోకాళ్ళు, ఎముకలు పాదాల్లో నొప్పులుంటే మాత్రం ఈ మెట్లెక్కటం వల్ల చాలా నష్టం అలాంటప్పుడు నడకే మంచిది.