నవ్వొచ్చినా కన్నీల్లోస్తాయి. ఏడ్చినా కళ్ళనీళ్ళే వస్తాయి. ఏడ్చినా కళ్ళనీల్లే వస్తాయి. శరీరానికి గాయం తగిలిన మనస్సుకి కష్టం కలిగిన ముందుగా పలకరించే భావోద్వేగం ఏడుపు, భావోద్వేగాలకు కన్నీటి ప్రవాహలతోనే ఆనకట్టపడుతుంది. భాధ, దిగులు, కోపం, నిస్సహాయిత, నొప్పి అన్నింటికంటికీ తిరుగులేని సమాధానం ఏడుపే. ఎప్పుడు, ఏ సందర్భంలో ఏడ్చినా ఆత్మ పూర్తిగా పరిశుధం చేసుకున్నట్లే . నొప్పికి ఏడుపు ఒక ఉపసమనం. పసితనం నుంచి ఏడుపు ఒక బలహీనత అని పదే పదే వింటుంటాము. అందుకే సాధ్యామైనంత వరకు కన్నీళ్ళను నిగ్రహించుకోవడం అలవాటు చేసుకుంటాం. కానీ కన్నీళ్ళకు ఒక హీలింగ్ పవర్ వుంది. మనసు తీరా ఎడిస్తేనే కష్టం దూది పింజలాగా తేలిపోతుంది. మనకి ఉపసమనం లభిస్తుంది. ఈ ఉపసమన చర్యని ఏ సందర్భంలోనూ అపుకోకూడదు. ఒక విచారం శరీరంలోనుంచి కళ్ళలోంచి వెలికి ప్రవహిన్చినప్పుడే సుఖ, దుఃఖాలు బయటికి కొట్టుకుపోతాయి. వర్షం వెళిసాక తేలికైన మేఘాలతో ఆకాశం స్వచ్చంగా కనిపించినట్లు మనసు దుఃఖాన్ని పోగొట్టుకొని తెలికవ్వుతుంది.
Categories