Categories
పాలకూర,కాలె, లెల్యూస్ వంటి ఆకు కూరలు నిత్యం ఆహరంలో భాగంగా ఉంటే కంటి చూపు బావుండటమే కాకుండా గ్లోకోమా వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని అధ్యయనవేత్తలు అంటున్నారు. సుమారు 12 సంవత్సారాల పాటు 40 వేల మందిపై జరిగిన ఈ అధ్యయనం వారి ఆహారపు అలవాట్లు క్షుణంగా పరిశీలించారు. ఆకుకూరలు ఎక్కువగా తినే వారిలో కంటి జబ్బులు బాగా తక్కువగా ఉన్నాయని ఆకుకూరల ద్వారా లిభించే నైట్రేట్ కంటి వ్యాధులు రాకుండా కాపాడుతోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు కనీసం వారంలో మూడుసార్లు ఆకు కూరలు తప్పని సరిగా తినవలసిందిగా వీరు సూచించారు.