ఎన్నో పనులుంటాయి ఒక్కళ్ళే వెళ్ళక తప్పదు. రాత్రవుతున్న ఏదో పని కోసం చేసే ఉద్యోగం కోసమో ఒంటరిగా వెళ్ళక తప్పదు. మనసులో కాస్త బెదురుగా ఉంటుంది. అస్తమానం తోడెవరు ? ఇంట్లోకి చేరేదాకా ఇంట్లో వాళ్లకి మనశ్శాంతి ఎట్లా ? ఇలాంటి సమస్యల కోసం బీ సేఫ్ యాప్ వచ్చింది. దీని లోడ్ చేసుకొంటే చాలు సేఫ్ నెవర్ వాక్ డన్ తోడుగా వస్తుంది. ఇందులో ఫాలోమీ,  టైమర్ అలారం, ఫేక్ కాల్ ట్రాక్ మీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడికైన వెళ్లేప్పుడు స్నేహితులకు మన వివరాలు ఇస్తే చాలు ఎక్కడున్న సరే జీపీఎస్ ద్వారా తెలిసిపోతుంది. ఒక వేళ ఆపద ఎదురైనా సమాచారం ఇవ్వచ్చు. ఒక అలారం కూడా వెంటనే ఉంటుంది. వెంటనే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ధైర్యం వస్తుంది.

Leave a comment