Categories
చర్మం కాంతిగా ఉండేందుకు వంటింట్లో వాడే పదార్దాలు ఉపయోగించుకోమంటున్నారు ఎక్సపర్ట్స్ . మినపప్పు ఐదారు బాదం పప్పులు నీళ్ళలో రాత్రంతా నాననిచ్చి ఉదయన్న రుబ్బి ఆమిశ్రమం తో ప్యాక్ వేసుకుంటే ముఖ చర్మం మెరిసిపోవటం ఖాయం . ఈ ప్యాక్ ,చేతులు పాదాలకు కూడా వేసుకోవచ్చు కలబంద గుజ్జు ముఖం పై మొటిమలు,యాక్నే వల్ల ఏర్పడిన మచ్చల పై రాస్తే నెమ్మదిగా మచ్చలు తగ్గిపోతాయి ముఖం కాంతిగా ఉంటుంది. అలాగే జుట్టు మెరుపు పోయి బలహినమై తెగి పోతూ వుంటే కొబ్బరి పాలలో మెంతులు వేసి నాన నిచ్చి జుట్టు కుదుళ్ళ నుంచి పట్టించి ఓ ఆర గంట తర్వాత కడిగేస్తే జుట్టు చక్కగ వుంటుంది.వారానికోసారి చేసిన ఇది జుట్టుకు కండీషనర్ గా ఉపయోగపడి జుట్టును మెరిసేలా చేస్తుంది.