మహబూబాబాద్ జిల్లా నర్సింహులు పేట మండలం గోపతండా సర్పంచ్ అజ్మర్ లక్ష్మి. కొత్తగా ఏర్పడిన పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైంది. అనుకోకుండా కరోనా సమస్య వచ్చింది. తన ఊరిని కరోనా బారి నుంచి రక్షించుకొనేందుకు ఈ సర్పంచ్ తైవాన్ స్ప్రేయర్ ను భుజానికి ఎత్తుకొంది. పల్లెంతా తిరిగి రసాయన ద్రావణం పిచికారి చేస్తోంది ప్రజలను ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా కట్టడి చేసింది పంచాయతీ సిబ్బంది తో ఇంటింటికీ తిరిగి డెట్టాల్,మాస్క్ లు పంపిణీ చేస్తోంది.పారిశుధ్య కార్మికుల తో కలసి ఊరిని శుభ్రంగా ఉంచుతోంది. ఈ సర్పంచ్ కర్తవ్య నిష్ఠను మెచ్చు కొంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు.

Leave a comment