Categories
ఫాల్స్ ఐ లాషెస్ ఇప్పుడు మేకప్ లో ఒక భాగం కనురెప్పలు ఒత్తుగా కనిపించేందుకు అతికించుకునే ఈ ఐ లాషెస్ సహజమైన వెంట్రుకలు సింథటిక్ ఫైబర్ తో చేసినవి దొరుకుతున్నాయి. వీటిని ప్యాకెట్ నుంచి తీసి వాటి పొడవు కంటికి సరిపోయేలా మార్చుకోవాలి. బయట వైపు నుంచి సున్నితంగా చెయ్యాలి. కనురెప్పల పై ఐ లైనర్ వేసుకొని వీటిని సరిగ్గా అంటించు కోవాలి వీగాన్ లేటెక్స్ ఫ్రీ హైపో అలర్జనిక్ వంటి జిగుర్లను ఎంచుకోవాలి. తొలగించేటప్పుడు ఐ మేకప్ రిమూవర్ ను వాడాలి. తర్వాత ఆయిల్ తో కంటి పైన తుడిచి శుభ్రం చేసుకోవాలి.