Categories
సహజమైన మెరుపుతో ఉండే మ్యాట్ లిప్ స్టిక్ వేసుకునే ముందు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా పెదవులకు లిప్ బామ్ లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. లిప్ లైనర్ తో అవుట్ లైన్ వేసుకొని బ్రష్ తో కాకుండా ట్యూబ్ తోనే మ్యాట్ లిప్ స్టిక్ వేసుకోవాలి. లిప్ స్టిక్ ఆరేందుకు కాస్త సమయం తీసుకుంటుంది కనుక వెంటనే పెదవులను ముట్టుకోకూడదు. లేదంటే లిప్ స్టిక్ షేప్ అవుట్ అవుతుంది. లిప్ స్టిక్ కొనే ముందే దాని లో ఆయిల్ కంటెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. లేదంటే లిప్ స్టిక్ వేసుకున్నాక పెదవులు పగిలినట్లు అవుతాయి. కాస్త శ్రద్ధ తీసుకుంటే లిప్ స్టిక్ తో పెదవులు చక్కగా అందంగా కనిపిస్తాయి.